భారీగా ఈపీఎఫ్ఓ విత్ డ్రా…!

-

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో అందరికి తెలిసిందే. ఉద్యోగాలు కోల్పోయి కొందరు అవస్థలు పడుతుంటే మరి కొందరు జీతాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఉంది అనేది వాస్తవం. ఈ నేపధ్యంలో ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ల నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది కేంద్రం.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దీనితో ఆర్ధిక కష్టాలు పడుతున్న ఉద్యోగులు డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి గానూ అప్లై చేస్తున్నారు. 15 రోజుల్లో 10.02 లక్షల క్లెయిమ్స్ రాగా అందులో 6.06 లక్షల క్లెయిమ్స్ కోవిడ్ 19 అడ్వాన్సులే ఉన్నాయి. ఈపీఎఫ్ఓ 15 రోజుల్లో మొత్తం రూ.3,600.85 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసింది.

చాలా వరకు అప్లికేషన్స్ ని మూడు రోజుల్లోనే సెటిల్ చేస్తున్నామని కార్మిక శాఖ పేర్కొంది. మార్చి 26న కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఉద్యోగులకు రెండు వరాలు ప్రకటించింది. ఈపీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనం+డీఏ వీటిల్లో ఏది తక్కువ అయితే అది విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news