కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధులు కేటాయించడం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ..గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అనాథలా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మిన తమ అధినేత పవన్ కల్యాణ్ కల నేడు నేరవేరిందని అన్నారు.
కూటమిని గెలిపించిన ఆంధ్ర ప్రజలను విశ్వసించి రాష్ట్రానికి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. కాగా, ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నాదెండ్ల ఎన్నికను జనసేన అధ్యక్షుడు పవన్, స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ ద్వారా సమాచారాన్ని అందజేశారు.