అదిలాబాదులో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

-

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఐదు గోడౌన్స్‌లో తనిఖీలు చేపట్టాగా రూ.77,60,586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయి. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, పరారీలో ఉన్నర మరో ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కాను అమ్మినా, రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గుట్కాను సమూలంగా జిల్లా వ్యాప్తంగా రూపుమాపాలనే ఉద్దేశంతో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తూ నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని తెలిపారు. గుట్కా విక్రయదారులు నిషేధిత గుట్కాను విక్రయించడం మానుకోవాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news