SSMB29 మూవీ మ్యూజిక్ వర్క్ త్వరలో ప్రారంభిస్తా: కీరవాణి

-

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్న సినిమా కోసం అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ పక్క దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తుంటే మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి కావలసినట్టు లుక్ రెడీ చేసుకుంటున్నాడు. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవల్లో నిర్మించబోతున్న ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు..ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం గురించి వినిపిస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే…’SSMB29′ మూవీ స్టోరీ ఈ వారమే ఫిక్స్ అయినట్లు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తెలిపారు. ప్రస్తుతం టెస్టు షూట్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా సినిమా మ్యూజిక్ పనులు ప్రారంభించలేదన్నారు. జులై/ ఆగస్టులో మొదలుపెడతానని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news