టీ వ్యాపారంతో కోట్లు.. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని తెలిపిన జంట..!

-

కష్టపడితే దానికి తగ్గ ఫలితం ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఇలా నమ్మి సక్సెస్ అయిన వాళ్ళు కొందరు మాత్రమే ఉంటారు. ఈ జంట కి వచ్చిన చిన్న ఆలోచన వీళ్ళ జీవితాన్ని మార్చేసింది. ఆ ఆలోచనే వాళ్ళని కోట్లు సంపాదించేలా చేస్తోంది. సాధారణంగా టీ వ్యాపారం అంటే చాలా చిన్నగా చూస్తారు. కానీ వీళ్ళు మాత్రం పెద్ద స్థాయి కార్పొరేటర్ స్థాయిలోకి తీసుకువెళ్లాలని ఈ వ్యాపారం మొదలుపెట్టారు.

 

డికాక్షన్ అని ఒక స్టార్ట్ అప్ తో వీళ్ళు మొదలుపెట్టారు. ఈ రోజు ఏకంగా వంద కేంద్రాల మైలురాయిని దాటింది. అది కూడా కేవలం ఏడాదిన్నర లోనే. మరి ఇక వీరి వ్యాపారం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… అద్దేపల్లి సంతోషి, జై కిరణ్ హైదరాబాద్ కి చెందిన వారు. వీళ్ళు ఏడాది క్రితం కరోనా మహమ్మారి సమయంలో ఈ వ్యాపారం మొదలుపెట్టారు తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని బ్రాంచీలు ఉన్నాయి.

ఏప్రిల్ నాటికి 130 ఔట్లెట్స్ ని దాటుతుంది అని తెలిపారు. కర్ణాటకలో కూడా వీరి టీ షాప్స్ ని పెట్టాలని అనుకుంటున్నారు, కేవలం హైదరాబాద్లో 70 కేంద్రాలు ఉన్నాయి. టీ, కాఫీ తో పాటుగా మిల్క్ షేక్, థిక్ షేక్ వంటివాటిని కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు నుండి నలుగురు వరకు పనిచేస్తున్నారు.

అయితే మాకు వచ్చిన ఆలోచనని ఇలా ఇంత ముందుకు నడిపించడం ఆనందంగా ఉందని ఆ జంట చెబుతున్నారు. కృషి పట్టుదల ఉంటే కచ్చితంగా ఎవరైనా రాణించగలరు. పైగా వీళ్ళు నలుగురికి ఉపాధి ఇచ్చి ఎంతో ఆనందం పొందుతున్నారు. మరి ఈ యువ జంటను ఆదర్శంగా తీసుకుని మీకు వచ్చిన ఆలోచన తో మీరు కూడా ముందుకు వెళ్ళండి కచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చు. ప్రయత్నమే కదా సక్సస్ కి మొదటి స్టెప్.

Read more RELATED
Recommended to you

Latest news