వంట నూనె ధరలు గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, మోడీ అధికారంలోకి వచ్చాక, వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే.. తాజాగా వంట నూనె ధరలపై.. కేంద్రం కీలక ప్రకటన చేసింది. వంట నూనె ధరలు తగ్గాయంటూ కీలక ప్రకటన చేసింది కేంద్రం.
తాము తీసుకున్న నిర్ణయంతో దేశంలో గత కొన్ని నెలల కుకింగ్ ఆయిల్ రేట్లు దిగివచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కేజీకి రూ. 180 నుండి రూ. 170 గా తగ్గిందని పేర్కొంది. వనస్పతి కేజీకి రూ. 154 నుంచి రూ.146 కు, రిఫైన్డ్ సోయాబీన్ కేజీకి రూ. 157 నుంచి రూ.154 కు, మస్టర్డ్ ఆయిల్ కేజీకి రూ. 173 నుంచి రూ. 170 కు, ఆర్బిడి పామోలేన్ కేజీకి రూ. 138 నుంచి రూ. 119 కు తగ్గిందని తెలిపింది.