పుట్టిన తిథిని బట్టి మనిషి స్వభావాలు.. విశేషాలు ఇవే !

-

సాధారణంగా హిందూ సంప్రదాయంలో మనం ఏ రోజు అంటే ఏ తిథి, వారం పుట్టామో దాన్నిబట్టి వారి వారి స్వభావాలను అంచనా వేస్తారు మన పెద్దలు. ఇక నక్షత్రాలను బట్టి వారి భవిష్యత్లను అంచనావేయడం మన దగ్గర అనాదిగా వస్తుంది. ప్రస్తుతం తిథిల ప్రకారం మన స్వభావాలను తెలుసుకుందాం…

పాడ్యమి: ఈ తిధి యందు జన్మించిన దేవపూజ తత్పరుడు, ఙ్ఞానo కలిగినవాడు,శిల్ప విద్య విశారదుడు, మంత్రమందు అభిచార కర్మయందు సమర్ధుడు.

Do you have flaws in your astrology follow these steps
Do you have flaws in your astrology follow these steps

విదియ: ఈ తిధి యందు జన్మించిన, శత్రువులను హతమార్చువారు,పశువులు యందు దయ కలవాడు,పరాక్రమము కలిగిన వాడు, అభిమానము ,సంపద గలిగినవాడు అయి ఉండును.

తదియ: ఈ తిధి యందు జన్మించిన అమితమైన సౌందర్యం,అభిమానం ధనం కలవాడు,విద్యగలవాడు,మనస్సున అహంకారి,బంధువుల కార్యమందు ఇష్టము కలవాడు.

చవితి: ఈ తిధి యందు జన్మించిన సర్వకార్య విఘ్నము చేయువాడు,క్రూరుడు,ప్రపీడనానికి ఉన్న మార్గాన్ని అన్వేషించు వాడు,అత్యాశ కలవాడు, లావాటి శరీరం కలవాడు వ్యసములు కలవాడు అయి ఉండును.

పంచమి: ఈ తిధి యందు జన్మించిన సౌభాగ్యము,పాండిత్యము,సంపద కలవాడు,మాలావస్త్రము మొదలగు అలంకార వస్తువులందు ఇష్టము కలవారు ఇతరులకు ఉపకారం చేయువాడు.

షష్టి: ఈ తిధి యందు జన్మించిన బలము,చాల సేవకాజనులు కలవాడు,ముక్కోపి, ఙ్ఞానo కలవాడు,దైవపూజయందు ఇష్టము కలవాడు, క్షేమము గలవాడు,ఇతరములు యొక్క మంచిని గుణములను స్వీకరించు వాడు.

సప్తమి: ఈ తిధి యందు జన్మించిన క్రూరముగా పలుకువాడు,చెడ్డ మనస్సు గల సేవకాజనులు కలవాడు,శుభకర్మ యందు ఇష్టము కలవాడు,ఇంద్రియ నిగ్రహం కలవాడు, బలవంతుడు, రోగపీడితుడై ఉండును.

అష్టమి: ఈ తిధి యందు జన్మించిన పరాక్రమము, స్వాతంత్రము కలవాడు, పీడించువాడు, వెంటనే కోపించే వాడు, మంచి శరీరం, కామశీలం కలవాడై ఉండును.

నవమి: ఈ తిధి యందు జన్మించిన కోపము,స్వకార్య ఇష్టతయు, ఇతరులను ద్వేషించుట, చెడ్డ భార్యా పుత్రులు కలవాడు, దొంగలకు నాయకుడై ఉండెను.

దశమి: ఈ తిధి యందు జన్మించిన ధర్మశీలము, సుఖము, సత్ స్వభావము,సంపదయు, వాక్ సామర్ధ్యము కలవాడు, కాముకుడు, బంధు స్నేహం కలవాడు, పరస్త్రీలందు ఆసక్తి గలవాడు అయి ఉండును.

ఏకాదశి: ఈ తిధి యందు జన్మించిన పూజ్యుడు, సదాచారం కలవాడు, మంచి సేవకులు కలవాడు, సౌభాగ్యము, సంపద, మంచి స్వభావము కలవాడు అయి ఉండును.

ద్వాదశి: ఈ తిధి యందు జన్మించిన విష్ణు భక్తుడు ,త్యాగి,ధనవంతుడు, ప్రభువు, సర్వజనప్రియుడు, నిర్మల మనస్సు కలవాడు, విద్యావంతుడు, పుణ్యవంతుడు అయి ఉండును.

త్రయోదశి: ఈ తిధి యందు జన్మించిన కామియు, దర్భల శరీరుడు, సత్యం పలుకువాడు, మనోహరుడు,లుబ్ధుడు, ధనహీనుడు అయి ఉండును.

చతుర్దశి: ఈ తిధి యందు జన్మించిన పరస్త్రీలను, ఇతరులను ద్రవ్యం అడుగువాడు, తెలివి తక్కువు వాడు, అందరికి శత్రువై ఉండును. కోపము, దుస్వభావము. భయంకరుడు అయి ఉండును.

పౌర్ణమి: ఈ తిధి యందు జన్మించిన పరిపూర్ణమయిన అంగములు కలవాడు, విద్య, వినయము ,యశస్సు కలవాడు,శాస్త్ర అర్ధములు తెలిసినవాడు ప్రధాని అయి ఉండును.

అమావాస్య: ఈ తిధి యందు జన్మించిన దేవతలను, తల్లితండ్రులను పూజించు వాడు, కామి, పశుసంపదను నాశనం చేయువాడు, రోగి, బలం లేని శరీరం కలవాడు, దరిద్రుడు అయి ఉండును.

శుక్ల పక్షం యందు తిధులకు చెప్పిన శుభఫలములలో వృద్ధి, అశుభ ఫలములకు హానియు, బహుళ పక్షము నందు తిధులలో శుభఫలములు తగ్గుట, అశుభ ఫలములు పుష్టియు అగును. చంద్రుడు బలాబలములను అనుసరించి శుభ ఆశుభములను అనుసరించవలెను.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news