ఈ నెలలో దాదాపు 8 రోజులు బ్యాంకులు పని చేయవు. సాధారణ సెలవులతో పాటు రెండు పండగలు రావడంతో ఆయా రోజుల్లో బ్యాంకులు మూసి వేసి ఉంచనున్నారు. కాబట్టి ఖాతాదారులు ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో బ్యాంకుల్లో లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమయంలో బ్యాంకులో ఏమైనా పని ఉండొచ్చు. కాబట్టి జూలై నెలలో బ్యాంకు సెలవు రోజులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని పనికి ఎటువంటి అడ్డంకి లేకుండా చక్కబెట్టుకోండి.
బ్యాంకుల సెలవుల లిస్టు ఇదే:-
జూలై 5 – ఆదివారం
జూలై 11 – రెండో శనివారం
జూలై 12 – ఆదివారం
జులై 19- ఆదివారం
జూలై 20 – బోనాల పండగ(తెలంగాణ)
జూలై 25 – నాలుగో శనివారం
జూలై 26 – ఆదివారం
జూలై 31 – బక్రీద్