వందేళ్ల రంజీ క్రికెట్.. అరుదైన రికార్డ్..!

భారత వెటరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయర్ రఘునాథ్ చందోర్కర్ ఇటీవలే తన 100వ పుట్టినరోజు జరుపుకుని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. గతంలో మహారాష్ట్ర తరపున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడి తన ప్రతిభను చాటుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రఘునాథ్ చందొద్కర్.. 100వ పుట్టినరోజు జరుపుకున్న మూడవ రంజీ క్రికెటర్గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

1920 లో జన్మించిన ఆయన… మహారాష్ట్ర తరఫున… బాంబే తరఫున రంజీ మ్యాచ్ ఆడి అద్భుత ప్రతిభ కనబరిచాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అయినా రఘునాథ్ చందోర్కర్… ఇక 100వ పుట్టినరోజు జరుపుకున్న మూడవ క్రికెటర్ గా రికార్డు సృష్టించారు. ఆయనకంటే ముందు రంజి ఆటగాళ్లలో ప్రొఫెసర్ దేవదర్.. వసంత రాయ్ జి.. వందేళ్లు బ్రతికి 100వ పుట్టినరోజు జరుపుకున్నారు.