హర్ట్ అయిన జబర్దస్త్ కొత్త యాంకర్.. షో మానేయనుందా..?

-

2013లో అతి కొద్ది మంది కమెడియన్లతో ప్రారంభమైన ప్రముఖ కామెడీ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ప్రతిభ ఉన్నవారికి జీవితాన్ని ప్రసాదించింది. ఇప్పటికీ కూడా ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ వారికి ఒక ఇమేజ్ను అందిస్తోంది. ఈ క్రమంలోనే మొదట్లో అనసూయ యాంకర్ గా వ్యవహరించగా ప్రస్తుతం ఆమె సినిమాలలో బిజీ కావడం వల్ల ఆమె షో నుంచి తప్పుకుంది. అయితే కొద్ది రోజులు యాంకర్ రష్మీ చేసినప్పటికీ ఆమె కూడా బిజీ అవడం వల్ల ప్రముఖ సీరియల్ నటి సౌమ్యరావును యాంకర్ గా తీసుకొచ్చారు.

అయితే సౌమ్యరావు జబర్దస్త్ షో కి వచ్చి కొన్ని నెలలు కూడా పూర్తి కాకముందే ఆమె జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అనసూయ ఏ కారణంతో అయితే జబర్దస్త్ ను వీడిందో సౌమ్య కూడా అదే కారణంతో జబర్దస్త్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య కాలంలో జబర్దస్త్ లో కాంట్రవర్షియల్ కంటెంట్ వివాదాలకు దారి తీయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

ముఖ్యంగా జబర్దస్త్ షోలో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా హద్దులు మీరుతుండండంతో ఈమె కూడా ఈ షో నుంచి కూడా తప్పుకుంటోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ వెళ్ళిపోవడం వల్లే జబర్దస్త్లోకి సౌమ్య అడుగు పెట్టింది. మూడు, నాలుగు ఎపిసోడ్లు పద్ధతిగా చేసిన సౌమ్య పై సైతం.. హైపర్ ఆది లాంటి వాళ్ళ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి , బాడీ షేమింగ్ కామెంట్స్ కి ఆమె పూర్తిస్థాయిలో ఇబ్బంది పడుతోందట. మరి ముఖ్యంగా హైపర్ ఆది సౌమ్య విషయంలో మితిమీరి కామెంట్లు చేస్తున్నాడు . దాంతో అనసూయ చెప్పిన రీజన్ ఇక్కడ ఈమె కూడా చెబుతోంది. అందుకే షో నుంచి తప్పకుంటోంది అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంపై సౌమ్య స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news