భార్య మోసం చేసిందంటూ భర్త సూసైడ్.. సెల్ఫీ వీడియోలో షాకింగ్ విషయాలు..!

-

ఏపిలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణం మిత్తాగుడెం ప్రాంతానికి చెందిన ఆళ్ళ వెంకటేశ్వర రావు అనే వ్యక్తి భార్య మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్నాడు. వేంకటేశ్వర రావు బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడికి కృష్ణవేణి అనే యువతి తో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు వారి వివాహ జీవితం సాఫీగానే సాగింది. అయితే ఓ రోజున భార్య ఫోన్ లో మాట్లాడటం వెంకటేశ్వర రావు గుర్తించాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అని ప్రశ్నించగా సోదరితో అని చెప్పింది కృష్ణవేణి..కానీ అవతల నుండి వెంకటేశ్వర రావుకు మగ గొంతు వినిపించింది.

వేంకటేశ్వర రావు నిలదీయ గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య కోపంతో పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు సెల్ఫీ వీడియో తీసుకుని అత్మహత్య కు పాల్పడ్డాడు. తన భార్య తనను మోసం చేసిందని…తన చావుకు అత్తా మామ, భార్య కారణం అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన చేతిపై ఉన్న భార్య పేరు ను తొలగించి దహనం చేయాలని కోరాడు. పోలీసులు తన భార్య, అత్త మామ లను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version