ప్రియుడి మోజులో భార్య, లేదా ప్రియురాలి మోజులో భర్త ఇలాంటి వివాహేతర విషయాలు మరియు సంబంధాలు ఇటీవల కాలంలో వార్తల రూపంలో ఎక్కువగా వినిపిస్తున్నా యి. తాజాగా ఇటువంటిదే మరో ఘటన వెలుగు చూసింది. మంచి వాడు అని పెద్దలు చూసి పెళ్ళి చేశారు. కానీ అందరి ముందు అతను చేసిన పెళ్లి నాటి ప్రమాణాలను పక్కన పెట్టి భార్యను పట్టించుకోకుండా, వేరే మహిళ మోజులో పడ్డారు. భర్త ప్రవర్తన పై భార్యకు అనుమానం రావడంతో అతనిపై నిఘా ఉంచింది.
భర్తను ఫాలో అవ్వడంతో అసలు విషయం బట్ట బయలు అయ్యింది. ప్రియురాలితో తిరుగుతుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకుంది. అసలు విషయం కాస్తా అందరికీ చెప్పింది..ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళితే..తనను పట్టించుకోకుండా తిరుగుతున్నాడని గమనించిన భార్య అతడిపై ఓ కన్నేసి ఉంచింది. వేరే కాపురం పెట్టాడన్న అనుమానంతో అతడు ఎక్కడికి వెళ్లినా ఫాలో కావడం మొదలుపెట్టింది. భార్యకు తెలియకుండా ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న వ్యక్తిని బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా నడిరోడ్డుపై పట్టుకుంది.
అలా రోజు ప్రియురాలితో తిరుగుతున్న భర్తను వారం రోజులు ఫాలో అయ్యింది. అతను అప్పటికి ఇంటికి రాక పోవడంతో అతనికి బుద్ధి చెప్పాలని ఆమె గట్టిగా అనుకుంది. బైక్పై వెళ్తున్న జంటను ఐదారుగురు మహిళలు అడ్డుకొని గట్టిగా నిలదీయడంతో రోడ్డుపై వెళ్తున్న వారంతా ఒక్కసారిగా ఆగిపోయి సెల్ఫోన్లలో ఫ్యామిలీ పంచాయతీని వీడియో తీశారు. కట్టుకున్న భర్త తనను వదిలి వేరే యువతి వెంట వెళ్లేడన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోయిన ఆ మహిళ బైక్పై కూర్చున్న యువతిని కిందకు దింపి చెంపలు ఎర్ర బారేలా వాయించింది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..