వామ్మో .. ఇలాంటి కుక్కను ఎప్పుడైనా చూశారా?..గిన్నిస్ లో చోటు..

-

సాదారణంగా కుక్కలకు మనుషులకు మంచి సంబంధం ఉంటుంది. ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమ ఉంటుంది.అందుకే చాలా మంది పెంపుడు జంతువుగా కుక్కను ఎంచుకుంటున్నారు. మనం ప్రేమను చూపిస్తే అది కూడా ప్రేమను చూపిస్తుంది.అంతకన్నా ముందు విశ్వాసం కలిగిన జంతువు..అందుకే అందరి ముందుల జంతువు అని అంటారు.ఇవి ఎంత హైట్ ఉంటాయి ఒక అడుగు ఎత్తులో ఉంటాయి.. అంతకన్నా పెద్దగా అంటే రెండు అడుగుల లోపు ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే కుక్క మూడు అడుగులకు పైన ఉందని తెలుస్తుంది..మనిషికి దగ్గర దగ్గర ఉంది.

పెంపుడు కుక్కల్లో ఎతైన కుక్కగా అమెరికాకు చెందిన ‘జుయస్ అనే కుక్క గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. కేవలం రెండేళ్ల వయసున్న ‘జుయస్’ 3 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే ఎతైన మగ కుక్కగా నిలిచిందంటూ గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు..మనిషికి సగానికి ఉంటుంది.. చూడటానికి ఒక గుర్రంలా ఉంటుంది..వావ్ ..కుక్క గుర్రంలా ఉండటం ఏంటి అనే సందెహాలు కూడా అందరికి వస్తుంటాయి. అసలు ఆ కుక్క పుట్టుక గురించి చుద్దాము..

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర బెడ్ ఫోర్డ్ కి చెందిన బ్రిటనీ డేవిస్ కుటుంబం ఈ కుక్కను పెంచుకుంటుంది. అమెరికన్ గ్రేట్ డేన్ జాతికి చెందిన ఈ కుక్కలు సాధారణంగా ఐదేళ్ల కాలానికి గాని ఇంత ఎత్తు పెరగవు. అయితే జుయస్ మాత్రం రెండేళ్లకే మూడు అడుగులు పెరిగి..ప్రపంచంలో బ్రతికే ఉన్న ఎత్తైన కుక్కగా రికార్దును అందుకుంది.ఎక్కడికెళ్లినా జుయస్ వెంట వచ్చినప్పుడు చుట్టూ ఉన్నవారు తమ కుక్కనే చూస్తూండేవారని..ఒకరకంగా కొందరు అప్పుడప్పుడు ఇది కుక్క, గుర్రమా అని కూడా అడుగుతుంటారని చెప్పుకొచ్చింది..అందరితో సంతోషంగా ఉంటుందని కుక్క యజమానులు అంటున్నారు.ఏది ఏమైనా కూడా ఒక కుక్కకు ఇంతటి ఘనత రావడం విశేషం..

Read more RELATED
Recommended to you

Latest news