హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పార్టీలన్నింటికీ ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. ఇప్పటికే అధికార టీఆర్ ఎస్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ తమ అ భ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక బీజేపీ కూడా నేడో రేపో పార్టీ అభ్యర్థిని ప్ర కటించనుంది. మొత్తానికి అన్ని ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికను అంత్యంత ప్రతిష్టాత్మకంగా భా విస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో సబ్బండ వర్ణాల అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగుతున్నారు. ఈమేరకు మల్లన్నను స్వతంత్య్ర అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రకటించారు. హుజూర్‌నగర్‌లో అన్ని ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టాయని, పోటీ చేయడానికి సబ్బండ వర్గాల నుంచి అభ్యర్థులే కరువయ్యారా ? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మహాకూటమి ఎర్పడినప్పటి నుంచి ఏం మాట్లాడకుండా ఇప్పుడు తిరిగి మహాకూటమి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మొత్తానికి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా తీన్మార్ మల్లన్న ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో హు జూర్నగర్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మల్లన్న ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఓ న్యూస్ ఛానల్‌లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలతో మల్లన్న తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యాడు. అంతేగాక అధికార టీఆర్ ఎస్‌పై తనదైన శైలిలో విమర్శలు సం ధించడంలో ఆయన దిట్ట. టీవీ షోలతోపాటు, యూట్యూబ్ చానళ్ల ద్వారా మల్లన్న వేల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు.
ఈక్రమంలో ఆయన హుజూర్‌నగర్‌లో పోటీకి దిగుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే మల్లన్న సమాజిక మాధ్యమాల ద్వారా ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. హుజూర్ నగర్‌లో పోటీ చేస్తున్న తనకు అండగా నిలవాలని, విరాళాలు అందజేసి, సపోర్ట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చే స్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని హుజూర్‌నగర్ వేదికగా బయటపెడతానని అంటున్నాడు. అంతేగాక పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మద్దతు అడుగుతానని పేర్కొంటు న్నాడు. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు తనకు మద్దతుగా నిలిచాయని ఆయన పేర్కొనడం గమనార్హం