హుజూర్‌నగర్‌ : ఆత్మగౌరవానికి, నియంత పాలనకు మధ్య పోటీ

-

తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌ను మంచి హీటెక్కెస్తోంది. ఇక్క‌డ నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి మ‌రోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భార్య ప‌ద్మావ‌తి పోటీ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు, వాదోప‌వాదాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి శుక్ర‌వారం స్పందించారు. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక పద్మావతి-సైదిరెడ్డి మధ్య పోటీ కాదని.. 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి, నియంత పాలనకు మధ్య జరిగే ఎన్నిక అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ‌లో 12 శాతం ఉన్న దళిత వర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. 3.90 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం రోడ్లమీద తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. సర్పంచ్‌-ఉపసర్పంచ్‌లకు ఉమ్మడి చెక్‌పవర్ అని పంచాయితీ పెట్టారన్నారు. నియంతృత్వ పాలనకు అడ్డు కట్ట వేయాలంటే… హుజూర్‌నగర్‌లో పద్మావతి గెలుపు అనివార్యమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news