హుజూర్‌న‌గ‌ర్ 12వ రౌండ్ రిజ‌ల్ట్‌… సైరా సైదిరెడ్డి

-

హుజూర్‌న‌గ‌ర్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైరా సైదిరెడ్డి అన్న‌ట్టుగా దూసుకుపోతున్నారు. 9వరౌండ్ పూర్తయ్యే సరికి 20వేల 100 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి 14వేల ఓట్లకు పైగా ఆధిక్యతలో ఉండగా 9 వ రౌండ్ వచ్చే వరకు 20వేలు ఆధిక్యత దాటింది. ఇక తాజాగా 12వ రౌండ్ కూడా కంప్లీట్ అయ్యింది. 12 రౌండ్లు కంప్లీట్ అయ్యే స‌రికి సైదిరెడ్డికి ఏకంగా 23821 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.

కాంగ్రెస్‌ పార్టీ పట్టు ఉన్న మండలాల్లో సైతం హుజూర్ నగర్ లో వెనుకడి ఉండటాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రతీ రౌండ్ లోనూ అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కసీనం హోరా హోరీ పోరు ఉంటుందని అంచనా వేసారు. కానీ, అది తప్పింది. ఇక, కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలంగా పట్టు ఉన్న నియోజకర్గంలోని నేరేడుచర్ల మండలంలోనే అధికార పార్టీకి దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news