హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి ఇబ్రహీంపట్నం రవాణాశాఖ అధికారి కాళ్లు పట్టుకుని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి టిప్పర్ లారీలు 20టన్నులకు పైగా అధిక లోడుతో ఇసుక, కంకర తీసుకు రావడం వల్ల రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయన్నారు . ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని ఆయన వేడుకున్నారు.
ఓవర్ లోడ్ తో హయత్ నగర్ మీదుగా సిటీలోకి భారీ వాహనాలు ప్రవేశించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రవాణా శాఖ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే నగరంలో రోడ్ల పరిస్థితి అద్భుతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయంపై స్పందించిన అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్తో రవాణా చేస్తున్న లారీపై చర్యలు తీసుకుంటామన్నారు. విభిన్న పద్ధతుల్లో నిరసన తెలిపి, సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయడంలో కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి స్టైలే వేరు.