హైదరాబాద్‌కు చెందిన జెనారా ఫార్మా అనే కంపెనీకి కరోనా మెడిసిన్ ఫావిపిరవిర్‌ను తయారు చేసేందుకు గాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు జారీ చేసింది. బయోఫోర్ ఇండియా ఫార్మాసూటిక్స్‌కు చెందిన జెనారా ఫార్మా ఫావిపిరవిర్ మెడిసిన్‌ను ఫావిజెన్ పేరిట తయారు చేసి విక్రయించనుంది. అయితే ఈ మెడిసిన్ ఒక్క ట్యాబ్లెట్ ధర ఎంత.. అనే వివరాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
కాగా ఇప్పటికే ఫావిపిరవిర్ మెడిసిన్‌కు గాను అనేక ఫార్మా కంపెనీలు బ్రాండెడ్, జనరిక్ మందులను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జెనారా ఫార్మా కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది. ఫావిపిరవిర్ మెడిసిన్‌ను కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించేందుకు ఇస్తున్నారు. మరోవైపు రెమ్‌డెసివిర్ మందుకు కూడా పలు కంపెనీలు ఇటీవల అనుమతులు పొందాయి. ఈ మెడిసిన్‌ను కోవిడ్ అత్యవసర స్థితి ఉన్న పేషెంట్ల చికిత్సకు ఉపయోగిస్తున్నారు.
కాగా ఫావిజెన్ ట్యాబ్లెట్లను దేశంలోని అనేక హాస్పిటళ్లకు సప్లై చేస్తామని జెనారా ఫార్మా తెలిపింది. ఇదే మెడిసిన్‌ను మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు వివరించింది. హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలో ఈ మెడిసిన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.