భార్య చెల్లితో ల‌వ్ అఫైర్..పెళ్లి చేసుకుందామ‌ని తిరుప‌తి వెళ్లి చివ‌రికి..!

భార్య చెల్లితోనే ఓ వ్య‌క్తి ప్రేమాయణం నడిపించాడు. ఈ విష‌యం కాస్తా భార్య‌కు తెల‌వ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు మొద‌ల‌య్యాయి. మ‌ర‌ద‌లిని పెళ్లి చేసుకోవాల‌ని వెళ్లి చివ‌రికి ఆ భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ చందాన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…చందాన‌గ‌ర్ పాపిరెడ్డి కాల‌నీకి చెందిన సాయి న‌వీన్ అనే వ్య‌క్తికి నాలుగేళ్ల క్రితం కూక‌ట్ప‌ల్లి జేఎన్టీయూ కు చెందిన ఓ మ‌హిళ‌తో వివాహం జ‌రింగింది. వీరికి ఓ కుమారుడు ఉండ‌గా ప్ర‌స్తుతం సాయిన‌వీన్ భార్య మ‌రోసారి గ‌ర్భ‌వ‌తిగా ఉంది.

అయితే గ‌త కొద్దిరోజులుగా భార్యా భ‌ర్త‌ల మధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా న‌వీన్ త‌న భార్య చెల్లెలితోనే లవ్ అఫైర్ పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో భార్య త‌న పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక మ‌ర‌దలిని పెళ్లి చేసుకునేందుకు న‌వీన్ ఆమెతో క‌లిసి తిరుప‌తి వెళ్లి ఓ లాడ్జ్ అద్దెకు తీసుకున్నాడు. అయితే త‌న అక్క‌కు అన్యాయం చేయ‌లేను అని చెప్పి యువ‌తి నిద్ర‌మాత్రలు మింగింది. దాంతో న‌వీన్ అదే గ‌దిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న పై కేసున‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.