హైదరాబాద్ లో 9 వ తరగతి బాలిక ఆత్మహత్య

హైదరాబాద్‌ లోని పేట్ బషీరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధిలో ఉంటున్న మైనర్‌ బాలిక నిన్న అర్థ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య ఆ మైనర్‌ బాలిక. ఆత్మహత్య చేసుకున్న మైనర్‌ బాలిక 9 వ తరగతి చదువుతున్నట్లు సమాచారం అందుతోంది.

నిన్న రాత్రి మృతురాలి అన్న ( 15) ఇంటికి వచ్చి చూడగా… ఆ బాలిక ఉరి వేసుకున్న దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. అయితే.. ఆ మైనర్‌ బాలిక ఆత్మహత్య కు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని… దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మృతురాలు మైనర్ కావున పేరు, వివరాలు తెలుపడానికి నిరాకరించారు పోలీసులు. ఇంట్లో బెదిరింపులు, పాఠశాలలో ఏమైనా సంఘటనలు జరిగాయా… ? ఇంకేమైనా ఉంటుందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.