బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద దారుణం..!

బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద దారుణం చోటు చేసుకుంది. మూడు కుక్క పిల్లలను ప‌ట్టుకుని ఓ మైనర్ బాలుడు దారుణంగా చంపాడు. దాంతో నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు అత‌డికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయిన‌ప్ప‌టికీ ఆ బాలుడు త‌న పద్ధతి మార్చుకోకుండా పావురాలపై దాడి చేశాడు. దాంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ వాకర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

స‌దరు బాలుడు పావుల‌రాల‌ను చంపుతున్న వీడియో కు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో జంతు ప్రేమికులు బాలుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆ బాలుడికి (12) ఏళ్ల వ‌య‌సు ఉండ‌గా అత‌డు పావురాలు పట్టి బే బి అర్ పార్కు వద్ద విక్ర‌యిస్తాడ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా జంతువులను ప‌క్షుల‌ను చిత్ర హింస‌లు పెట్ట‌డం కూడా నేర‌మే..మూగ‌జీవాల‌కు సంబంధించిన చ‌ట్టాల ప్ర‌కారం కేసులు న‌మోదు చేస్తారు.