కిడ్నీల్లో 156 రాళ్లు.. తొలగించిన హైదరాబాద్ వైద్యులు

-

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించింది. ఓ 50 ఏండ్ల పేషెంట్ కిడ్నీల్లో నుంచి 156 రాళ్లను తొలగించినట్లు గురువారం ప్రకటించింది. మేజర్ సర్జరీకి బదులుగా డాక్టర్లు లాప్రోస్కోపి, ఎండోస్కోపీల ద్వారా కీడ్నీల్లో రాళ్లను తొలగించింది. ఓ పెషెంట్ కిడ్నీలో నుంచి వందకు పైగా రాళ్లను తొలగించడం దేశంలో ఇదే తొలిసారి. ఈ ఆపరేషన్ నిర్వహించడం కోసం డాక్టర్లకు మూడు గంటల సమయం పట్టింది. ప్రస్తుతం ఆ పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రం హుబ్లీకి చెందిన పేషెంట్ రొటీన్ చెకప్‌ కోసం వచ్చి ప్రీతి యూరోలాజీ అండ్ కిడ్నీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు.

స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న బస్వరాజ్ మాదివాలర్‌కు ఒక్కసారిగా వెన్నెముక కింద తీవ్రమైన నొప్పిరావడంతో విలవిలలాడిపోయారు. అతన్ని వైద్యులు పరీక్షించగా కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లు తేలింది. మూడు గంటలపాటు శ్రమించిన డాక్టర్లు 150కి పైగా రాళ్లను తొలగించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news