”నా ఆత్మహత్యకు కేటీఆర్, సబితలే కారణం”’ : ఇంట‌ర్ విద్యార్థి సంచ‌ల‌న ట్వీట్

ఇవాళ తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌ ప‌రీక్ష‌లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ప‌రీక్షా ఫ‌లితాల్లో.. కేవ‌లం 49 శాతం మాత్ర‌మే ఉత్తీర్ణులు అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే.. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ట్విట్ క‌ల‌కలం రేపింది. ‘నా ఆత్మహత్యకు కేటీఆర్, సబితలే కారణం అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు గ‌ణేష్ అనే ఇంటర్ విద్యార్థి. 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన గణేష్ అనే విద్యార్థి… ‘సర్.. ఏం రాసినా పాస్ చేస్తామని చెప్పి అందర్నీ ఫెయిల్ చేశారు.

నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోబోతున్నా.. నా ఆత్మహత్యకు మంత్రులు KTR, సబితా ఇంద్రారెడ్డి కారణం’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అలర్ట్ అయిన హైదరాబాద్ సిటీ పోలీసులు… విద్యార్థి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఆ త‌ర్వాత‌..Guys i am good అంటూ రీ ట్వీట్ చేశాడు ఆ యువకుడు.. సూసైడ్ అటెంప్ట్ నుండి తన నిర్ణయాన్ని మార్చుకున్న యువకుడు.. తను బాగానే ఉన్నానని రి ట్వీట్ చేశాడు.దీంతో హైదరాబాద్ సిటీ పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.