‘వాటర్ ప్లస్’ సిటీ గా హైదరాబాద్ : సర్టిఫికెట్ జారీ చేసిన కేంద్రం

-

గ్రేటర్ హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం హైదరాబాద్‌ను ‘వాటర్ ప్లస్’ నగరంగా ధృవీకరించింది. దీంతో  తెలంగాణలో ఈ ఘనత సాధించిన మొదటి పట్టణ కార్పొరేషన్ సంస్థగా హైదరాబాద్‌ మహానగరం నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఇప్పటికే ODF ++ గా సర్టిఫికేట్ పొందిగా తాజాగా ‘వాటర్ ప్లస్’ సర్టిఫికేట్ దక్కించుకుంది. ఇటీవల కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సేకరించిన సర్వే లో హైదరాబాద్ కు ‘వాటర్ ప్లస్’ సర్టిఫికేట్ దక్కింది.

హైదరాబాద్ వ్యాప్తంగా 25 మురుగునీటి శుద్ధి కర్మాగారాలను (STP లు) నిర్వహిస్తున్నది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS & SB). ఇటీవల అదనంగా,మరో మూడు STP లను ఏర్పాటు చేసింది. 2014 లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకారం.. మురుగునీటి శుద్ధి, పార్కులు, రోడ్లు, పబ్లిక్ టాయిలెట్‌లు శుభ్రంగా ఉంటూ.. బహిరంగ మూత్ర విసర్జన లేని నగరాలకు ‘వాటర్ ప్లస్’ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే మంచి నీటి సౌకర్యాలు, పేదలకు అన్నీ రకాల సౌకర్యాలు కల్పించే మునిసిపల్ కార్పొరేషన్లు కూడా ఈ కోవాలోకే వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news