కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ రేపు అర్ధరాత్రి మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రేపు చివరి మెట్రో రైలు తొలి స్టేషన్ నుంచి అర్ధరాత్రి దాటాక 12.15 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు.
మెట్రో ట్రైన్స్ తో పాటు అన్ని మెట్రో స్టేషన్లలో పోలీసులతోనూ నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి ఎవరైనా మద్యం తాగి వచ్చి తోటి ప్రయాణికులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డు జనవరి 1వ తేదీన పనిచేస్తుంది. కేవలం రూ.59కే రీఛార్జ్ చేయించుకున్న తర్వాత రోజంతా హైదరాబాద్ మొత్తం ఎన్ని ట్రిప్పులైనా ప్రయాణించవచ్చు. కొత్త సంవత్సరం రోజున ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్‌లోని దర్శనీయ ప్రదేశాలకు చాలామంది వెళ్తుంటారు. మెట్రో ట్రైన్ సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డు ప్రతి ఆదివారం రోజున పనిచేస్తుంది. ఇక రేపు, ఎల్లుండి మెట్రోలో తక్కువ ధరకే వెళ్ళవచ్చని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.