హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్..

-

గ్లోబల్ వైడ్‌గా ఉన్న పలు సంస్థల అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతాలు హ్యాక్ అయ్యాయి. తమ ఖాతాలు పనిచేయకపోవడంతో యూజర్లు ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఏం జరుగుతుందో వారికి ఏమీ అర్థం కాలేదు. ఇందులో ఎక్కువగా వ్యక్తిగత ఖాతాల కంటే సంస్థలకు చెందిన ఖాతాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రస్తుతం ఖాతాలు సాధారణంగానే పనిచేస్తున్నట్లు ఎక్స్ ప్రకటించింది. సైబర్ అటాక్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత యూజర్లను హెచ్చరించింది.

ఈ క్రమంలోనే హ్యాకర్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాను కూడా హ్యాక్ చేశారు.ఇందులో భాగంగా సైబర్ కేటుగాళ్లు మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఏకంగా ఆ సంస్థ అఫీషియల్ అకౌంట్‌లో #HACKED ON SOLANA పేరుతో ట్వీట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన టెక్నికల్ టీమ్ హుటాహుటిన హైదరాబాద్ మెట్రో రైల్ ‘ఎక్స్’ అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news