బ్రేకింగ్‌: రెండు కారిడార్లలో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో

హైద్రాబాద్‌ మెట్రోలో సాంకేతిక లోపం ప్రయాణికుల్ని ఇబ్బందుల పాలు చేసింది. అమీర్‌పేట్‌ – ఎల్బీ నగర్‌ మధ్య సాంకేతిక లోపం తలెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే సమయంలో కీలకమైన అమీర్‌పేట్‌ – ఎల్పీనగర్‌ రూట్లో సర్వీసులు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది జరిగిన కొద్ది సేపటికే నాగోల్- రాయదుర్గం మార్గంలో మెట్రో రైలు నిలిచిపోయింది.

Metro
Metro

చాలా సేపటి నుండి మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ఆఫీసులకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా హైదరాబాద్ మెట్రో రైలు జనాన్ని టెన్షన్ పెడుతూనే ఉంది. ట్రాఫిక్ తో పోలిస్తే ఇది బెటర్ అని జనం భావిస్తున్నారు.కానీ ఈ మెట్రో మాత్రం ఎప్పటికప్పుడు సాంకేతిక కారణాలతో జనాన్ని మాత్రం టెన్షన్ పెడుతూనే ఉంది. ప్రస్తుతానికి  మెట్రో అధికారులు రైళ్లను పునరుద్దరించే పనిలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ రైళ్లను పునరుద్ధరిస్తామని చెబుతున్నారు.