ఏపీలో మరో విగ్రహం ద్వంసం

-

ఏపీలో విగ్రహాల ధ్వంసం ఆగడం లేదు. ముందుగా అంతర్వేది రధం దగ్ధం ఘటన మొదలయిన ఈ అనుచిత ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ రోజు మరో విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు. ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం అయింది.  దేవ స్థానం ముఖద్వారం మీద ఉన్న విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.  ఈ ఘటనలో స్వామివారు చేయి విరిగిన ట్లుగా సమాచారం అందుతోంది.

 

ముందుగా విగ్రహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇక మరో పక్క ఈరోజు చలో రామతీర్ధం కు బీజేపీ- జనసేన శ్రేణులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారింది. రామతీర్ధం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం మీద ఏపీ రాజకీయాలు మొత్తం ఆలయాల చుట్టూ తిరగడం గమనార్హం. 

Read more RELATED
Recommended to you

Latest news