Rain Alert : హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

-

హైదరాబాద్ లో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కాసేపు కురిసిన వర్షానికే భాగ్యనగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్న రహదారులపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నగరంలోని రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పూరా, గండిపేట్, ఆరాంఘర్, శంషాబాద్, బండ్లగూడ జాగిర్, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కాస్, మియాపూర్‌, చందానగర్, మదీనాగూడ, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, వెంగల్ రావు నగర్, యూసఫ్‌గూడ, మైత్రివనం, అమీర్‌పేట , పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది.

ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పూర్, దోమలగూడ, గాంధీనగర్ జవహర్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద నిరీక్షించాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news