హైద‌రాబాద్‌లో న‌ల్లా నీరు చాలా సురక్షితం.. సేఫ్టీలో దేశంలోనే రెండో స్థానం..!

-

హైద‌రాబాదీయులు నిజంగా చాలా సంతృప్తిగా ఫీల‌వ్వాల్సిన వార్త ఇది. ఎందుకంటే.. హైద‌రాబాద్‌లోని ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా అయ్యే న‌ల్లా నీరు చాలా సుర‌క్షితమైంద‌ని, సేఫ్టీలో ఈ నీరు దేశంలోనే రెండో స్థానంలో ఉంద‌ని వెల్ల‌డైంది.

హైద‌రాబాదీయులు నిజంగా చాలా సంతృప్తిగా ఫీల‌వ్వాల్సిన వార్త ఇది. ఎందుకంటే.. హైద‌రాబాద్‌లోని ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా అయ్యే న‌ల్లా నీరు చాలా సుర‌క్షితమైంద‌ని, సేఫ్టీలో ఈ నీరు దేశంలోనే రెండో స్థానంలో ఉంద‌ని వెల్ల‌డైంది. ఈ మేర‌కు కేంద్ర వినియోగ‌దారుల సంబంధాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఓ నివేదిక‌ను విడుద‌ల చేశారు. అందులో ఏముందంటే…

hyderabad tap water is 2nd safest in country

బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) దేశంలోని ప‌లు ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రా అవుతున్న న‌ల్లా నీటిని సేక‌రించి వాటి సేఫ్టీపై ల్యాబొరేట‌రీలో ప్ర‌యోగాలు జ‌రిపింది. ఈ క్ర‌మంలో తేలిందేమిటంటే.. దేశంలో ముంబైలో స‌ర‌ఫ‌రా అవుతున్న న‌ల్లా నీరు అత్యంత సుర‌క్షిత‌మైంద‌ని, దానికి సేఫ్టీలో దేశంలో మొద‌టి స్థానం ల‌భించింద‌ని, ఆ త‌రువాతి స్థానంలో హైద‌రాబాద్ ఉంద‌ని వెల్ల‌డైంది.

ఇక దేశంలో ఉన్న 21 న‌గ‌రాల్లో అత్యంత అసుర‌క్షిత‌మైన న‌ల్లా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న న‌గ‌రాల్లో ఢిల్లీ మొద‌టి స్థానంలో ఉంద‌ని ఆ నివేదిక‌లో వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో ఆ నివేదిక‌ను విడుద‌ల చేసిన సంద‌ర్భంగా మంత్రి పాశ్వాన్ మాట్లాడుతూ.. దేశంలో ఆయా న‌గ‌రాల్లో ల‌భిస్తున్న న‌ల్లా నీరు ఎంత సురక్షితమైందో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకే ఈ ప‌రీక్ష‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. అందులో భాగంగా ఆయా న‌గ‌రాల్లో ల‌భ్య‌మ‌య్యే నీటి సేఫ్టీని ప‌రీక్షించ‌డం కోసం తాము 28 అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నామ‌ని, ఆ త‌రువాతే నీటి సేఫ్టీపై నివేదిక‌ను త‌యారు చేశామ‌ని వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news