హైదరాబాద్ కు చెందిన పద్నాలుగేళ్ల అగస్త్య జైస్వాల్ భారతదేశంలో అటు చిన్న వయసులోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి విద్యార్థిగా క్లెయిం చేసుకున్నారు. తాజాగా అగస్త్య జైస్వాల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం డిగ్రీ పూర్తి చేశారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవల దాని ఫలితాలు ప్రచురించింది. తెలంగాణలో 9 సంవత్సరాల వయసులో 7.5 జీపీఏ 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తొలి బాలుడు కూడా తానేనని అగస్త్య పేర్కొన్నాడు.
“నేను కేవలం 14 సంవత్సరాల వయస్సులో బిఎ పూర్తి చేసిన భారతదేశంలో మొదటి అబ్బాయిని అయ్యాను. 11 సంవత్సరాల వయస్సులో, తెలంగాణలో 63 శాతం ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి బాలుడిని కూడా నేనే” అని అగస్త్య చెప్పారు. ఇక అగస్త్య జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు కూడా. “నా తల్లిదండ్రులు నా గురువులు, వారి మద్దతుతో, అసాధ్యమని అనుకునే సవాళ్లను కూడా నేను అధిగమించాను. నేను కేవలం 1.72 సెకన్లలో A నుండి Z వర్ణమాలను టైప్ చేయగలను. నేను 100 వరకు టేబుల్స్ ని చెప్పగలను. అలానే నేను రెండు చేతులతో వ్రాయగలను. అంతే కాక నేను అంతర్జాతీయ ప్రేరణాత్మక వక్తని కూడా “అని అగస్త్య అన్నారు. ఇక “నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను; కాబట్టి నేను MBBS చేస్తాను” అని ఆయన చెప్పారు. అతని తండ్రి అశ్విని కుమార్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రతి బిడ్డకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహిస్తే, ప్రతి బిడ్డ ఇలా చరిత్ర సృష్టించవచ్చని అన్నారు.