హైదరాబాద్ లో బయటకు ఇప్పుడు వెళ్ళండి…!

-

లాక్ డౌన్ ఉందని చెప్పినా సరే జనాలకు కనీసం పట్టడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతున్నారు. అమ్మా అయ్యా అని చెప్తుంటే కనీసం ఎవరికి అర్ధం కావడం లేదు. లాక్ డౌన్ ని ఉల్లంఘించ వద్దు అని ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా బయటకు వస్తున్నారు. పదే పదే బయటకు రావొద్దని ప్రభుత్వాలు పోలీసులు చేప్తున్నా వినడం లేదు.

దీంతో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్ల మీదకు వస్తే బైక్‌ను స్వాధీనం చేసుకోనున్నారు. వైద్య సంబంధ, అత్యవసర కారణాలు మినహా మిగతా వాళ్లను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు చెప్పారు. ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, పాతబస్తీ ప్రాంతాల్లో మంగళవారం వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి.

దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీస్ ఉన్నతాధికారులు కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా ట్రాఫిక్‌ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో వారిపై కేసు పెట్టడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, వాహనాల స్వాధీనమే సరైన మార్గమని పోలీసులు పేర్కొంటున్నారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news