హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 75 శాతం సిటీ సర్వీసులు నడుపుకోవడానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న టి.ఎస్.ఆర్టీసీ స్థితిగతులపై నిన్న ప్రగతి భవన్ లో సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సిటీ సర్వీసుల ఆపరేషన్స్‌పై కోరిన కోరికకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
కరోనాను కట్టడి నివారణలో భాగంగా గతంలో నిర్ణయం తీసుకున్న 50 శాతం సిటీ సర్వీసుల ఆపరేషన్స్ ను రవాణా శాఖ మంత్రి కోరిక మేరకు 75శాతం బస్సులను నడుపుకోవడానికి సిఎం అంగీకరించారు. సిటీ సర్వీసుల రాకపోకలు పెరగడం ద్వారా ప్రయాణీకుల ఇబ్బందులు కొంత తొలగిపోనున్నాయంటూ, సంస్థను నగరవాసులు ఆదరించాలని మంత్రి కోరారు.