హైదరాబాద్ లో భారీ ఎత్తున పొగమంచు ఏర్పడుతున్న కారణంగా వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు సూచనలు చేశారు. పొగమంచు కారణంగా ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెల్లవారు జామున ప్రయాణాలు తగ్గించండి, పొగమంచు కప్పి ఉన్నందున రోడ్డు కనిపించదని పోలీసులు పేర్కొన్నారు. వాహనానికి ఎక్కువ వెలుతురు ఉన్నా హెడ్ లైట్స్ వల్ల అవతల వాహనదారుడికి అడ్డంకులు ఏర్పడతాయని, సో పొగమంచు వాహన అద్దం మీద పడి రోడ్డు కనిపించదు, వైపర్లు ఖచ్చితంగా ఉండాలి అని పోలీసులు పేర్కొన్నారు.
వాహనానికి మరో వాహనానికి మద్య దూరం ఉండేలా వెళ్లాలని సూచించారు. బ్రేక్ వేసే ముందు వెనక వచ్చే వాహనాలని చూసుకోవాలని పోలీసులు సూచించారు. హైవేలపై, రోడ్లపై వాహనాలు నిలప రాదని పేర్కొన్నారు. పొగ మంచుకు కనపడక ప్రమాదాలు అవుతాయని పేర్కొన్నారు. వాహనం లో పెద్ద సౌండ్స్ పాటలు పెట్టుకోకుండా రోడ్ పై దృష్డి పెట్టండని సూచించారు. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు హారన్ కొడుతూ వెళ్లండని పోలీసులు చెబుతున్నారు.