ఖతర్నాక్ కామిడీ షో లో కరోనా..! ”హైపర్ ఆది” క్వారంటైన్ లో….!

-

పేద ధనిక తేడా లేకుండా స్వైరవిహారం చేస్తుంది కరోనా మహమ్మారి. ఈ వ్యాధికి హద్దు అదుపు లేకుండా పోయింది ఎక్కడికైనా వెళ్లిపోతుంది ఎవ్వరినైనా అటాక్ చేస్తుంది. ఆ ప్రాంతంలో వారు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా ఏదో ఒక తావు నుండి ఈ మహమ్మారి అక్కడకు చేరిపోతుంది. భీకరంగా విజృంభించి ఆ ప్రాంతాన్ని తన కైవసం చేసుకుంటుంది. ఇక ఇదే తరహాలో తెలుగు ప్రజలను ఎంతగానో అలరించే ప్రోగ్రామ్ జబర్దస్త్ ను కూడా కరోనా వదలలేదు. అక్కడకు కూడా చేరుకొని మనకి బాగా తెలిసిన వారి టీమ్ పై పంజా విసిరింది. దెబ్బకు ప్రోగ్రామ్ ఆపేశారు హోమ్ క్వారంటైన్ కు వెళ్ళిపోయారు.

hyper aadi and his team went to home quarantine
hyper aadi and his team went to home quarantine

మనకి ఎంతగానో నచ్చే హైపర్ ఆది టీమ్ ను కరోనా కలవర పెడుతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పునఃప్రారంభం అయ్యింది జబర్దస్త్ ఖతర్నాక్ కామిడీ షో..ఇక అక్కడ సిబ్బంది అన్నీ జాగ్రత్తలు తీసుకొని షో ను నడుపుతున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే కరోనా అక్కడకు చేరిపోయింది. హైపర్ ఆది టీమ్ లో పనిచేసే ఓ వ్యక్తి పై కరోనా దాడి చేసింది. ముందు కాస్త జ్వరంగా అనిపించడంతో సూదురు వ్యక్తి టెస్ట్ చేయించుకున్నాడు ఆ టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది. అంతకు ముందే హైపర్ ఆది టీమ్ తో కలిసి పనిచేసినట్టు ఆయన వెల్లడించాడు దాంతో హైపర్ ఆది టీమ్ హోమ్ క్వారంటైన్ కు వెళ్ళిపోయారు. జబర్దస్త్ నిర్వాహకులు షో ను మరలా కొన్ని రోజుల వరకు ఆపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news