హైపర్ ఆది ధమాకా సినిమా రివ్వూ అదిరిందిగా.!

-

మాస్ మహారాజ్ రవితేజ మరియు శ్రీ లీల నటించిన ధమాకా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కాస్తా ఆలస్యం అయ్యింది. డిసెంబర్ 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిన్న పాత్రలో నటించిన ఆది తన దైన శైలిలో సినిమా గురించి మాట్లాడారు .

ఈ సినిమా నేను యూనిట్ తో పాటు చూశానని సినిమా అదిరిపోయిందని రవితేజ నటన, శ్రీ లీల అందం, భీమ్స్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రసన్న డైలాగ్స్, త్రినాథరావు డైరెక్షన్ ప్లస్ పాయింట్స్ అని అన్నాడు. ఇక సినిమా కూడా సూపర్ స్పీడ్ గా ఉండి బోర్ కొట్టకుండా ఉంటుందట.

ఇక హీరోయిన్ శ్రీ లీల అయితే అందంతో ఆకట్టుకునేలా ఉంటుందట.శ్రీలీలను చూస్తే లవర్ లేని వాళ్లకు ఇలాంటి లవర్ ఉండాలని అనిపిస్తుందట. లవర్ ఉన్న వాళ్లకి అయితే.. ఇలాంటి లవర్ ఉంటే బాగుండు అని చాలా మంది అబ్బాయిలు భావిస్తారట. ఇలా సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యేలా రివ్వూ ఇచ్చాడు హైపర్ ఆది. చూస్తూంటే ఈ సినిమా విడుదలకు ముందే బాగా హడావుడి చేస్తోంది .

Read more RELATED
Recommended to you

Exit mobile version