కారణం ఏంటో కూడా తెలియదు.. ఒకరిని చూసి వెనక మరొకరు పరుగు.. అలా మొత్తం

-

కొన్నిసార్లు భయం వింత పరిస్థితులన్ని ఎదుర్కొనేలా చేస్తుంది. ఆ భయం వల్ల కారణం ఏంటో తెలియకుండానే.. మనం ఆ గుంపులో కలిసిపోతాం.. అలాంటి ఒక ఘటనే ఇక్కడ జరిగింది. రోడ్డు పక్కన ఒక హోటల్‌..మధ్యలో ఫుట్‌పాత్‌..వ్యూ బాగుంది.. నైట్‌ టైంలో అందరూ తింటున్నారు.. సడన్‌గా పరిగెత్తుకుంటూ కొంతమంది ఆ ఫుట్‌పాత్‌పై వెళ్లారు. అది చూసిన రెస్టారెంట్‌లో ఓ మహిళ ఎందుకో ఏంటో తెలియకుండా పరిగెత్తింది.. ఆమె వెనుక ఇద్దురు వారి వెనుక ముగ్గురు అలా..సెకండ్ల వ్యవధిలో మొత్తం రెస్టారెంట్‌ అంతా ఖాళీ అయింది. పాపం బిల్‌ అయినా కట్టారో లేదో..! ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది..

బ్రెజిల్‌లోని ఎడ్ కాలిఫోర్నియా ప్రాంతంలో వీధి పక్కన చిన్నచిన్న హోటళ్లలో జనం కూర్చుని ఆహారం తింటున్నారు. మనుషులు నడిచే వాకింగ్ ట్రాక్‌కు అటూ ఇటూ ఆ హోటళ్లు ఉన్నాయి. మధ్యలోంచి కొందరు అటూ ఇటూ తిరుగుతున్నారు. కాసేపటికి కొందరు వ్యక్తులు జాగింగ్ చేసుకుంటూ అటువైపు వచ్చారు. హోటళ్ల మధ్యలోని దారి నుంచి జాగింగ్ చేస్తూ వెళుతున్నారు. ఇదే క్రమంలో మొదట ఒకరు.. వెనుక ఇంకో నలుగురు జాగింగ్ చేస్తున్నారు. జాగింగ్ చేస్తున్న వారిని చూసి, ఏదో జరిగిందని, అందుకే వాళ్లు పారిపోతున్నారేమో అని భావించిన ఓ మహిళ.. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమోనని అక్కడ్నుంచి జంప్‌.. అది చూసి మరికొందరు పారిపోవడం ప్రారంభించారు. వెంటనే అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒక్కరు కూడా మిగలకుండా అంతా పడుతూ లేస్తూ అక్కడి నుంచి పరుగెత్తారు. చివరికి చూస్తే ఏమీ లేదు. ఇంకా జాగింగ్ చేసేవారు మెల్లగా పరుగెడుతూ వస్తూనే ఉన్నారు. ఈ దృశ్యమంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. అయితే ఈ ఘటన రాత్రిపూట జరగడంతో అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉంది.

ఈ వీడియోను కోటిమందికి పైగా వీక్షించారు. లక్షమందికి పైగా లైక్‌ చేశారు. ఇది సరదాగా ఉందంటూ కొందరు, ‘మనుషుల తత్వమే అంత’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు..

ఇంతకీ కారణం ఏమై ఉంటుంది..?

బ్రెజిల్ లో మాఫియా గ్యాంగులు ఎక్కువ. వీధుల్లోనే దాడులు, కాల్పులు జరుపుకోవడం వంటివి తరచూ జరుగుతుంటాయట.. అందుకే ఒకరిద్దరు పరుగెత్తగానే.. అలాంటి మాఫియా ముఠా దాడి ఏదో జరుగుందేమోనన్న భయంతో మిగతావారు కూడా పరుగెత్తి ఉంటారని అని బ్రెజిల్‌కు చెందిన ఓ నెటిజన్ వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version