సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురుపౌర్ణమిని పురస్కరించుకొని ప్రజలే తన గురువులు అంటూ చేసిన పోస్ట్ నెట్టింట్లా వైరల్‌గా మారింది.తనకు ప్రత్యేకంగా ఒక గురువు అంటూ ఎవరూ లేరని ఆనంద్ మహీంద్రా తెలిపారు. మన చుట్టూ ఉండే వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అన్నారు. కొందరు అనుభవ పాఠాలు నేర్పితే, మరికొందరు వారికున్న జ్ఞానాన్ని బోధిస్తారు. తన చుట్టూ ఉండే ప్రజల నుంచి చాలా నేర్చుకుంటానని, వారే తన తప్పొప్పులు సరి చేస్తుంటారని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలంతా తనకు గురువులే అని తెలిపారు. పోస్ట్ వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ ‘గురువుల గొప్పదనం మాటల్లో చెప్పలేనిది. వారే మార్గదర్శకులు’ అని,మరో నెటిజన్ స్పందిస్తూ ‘ఇతరులు మీకు చేసిన సహకారానికి విలువ ఇస్తారు గనుకే ఈ స్థాయిలో ఉన్నారు’ అంటూ కామెంట్ చేశారు. ‘జీవితంలో ప్రతి దశలోనూ గురువులు ఉంటారు. వారి సలహాలను పాటిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.