మీరు ఆ విషయం అడుగుతుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది : కమల్ హాసన్

-

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు -2. భారతీయుడు’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ జులై 12న తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ….ఇటీవల మేకర్స్ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయుడు సినిమా యూనిట్ కు ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది. ఓ రిపోర్టర్ సినిమాలో సేనాపతి వయసు ఎంత? ఆ వయసులో ఆయన ఫైట్స్ ఎలా చేయగలుగుతున్నాడు? అని అడిగాడు. దానికి సమాధానంగా కమల్ అదిరిపోయే కౌంటర్ వేశారు.సినిమాలో సేనాపతి వయసు గురించి అడుగుతుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రశ్నకి జవాబు చెప్పకూడదు కానీ.. నేను చెబుతాను. మీరెప్పుడైనా సూపర్ మాన్ వయసు అడిగారా? హనుమాన్ వయసు అడిగారా? మరి సేనాపతి వయసు గురించి మాత్రం ఎందుకు అడుగుతున్నారు . అతను ప్రతి చోటా ఉన్నాడు. చాలా యుగాలు దాటుకుంటూ వస్తాడు. అందుకే అతను అందరిలో కెల్లా ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి.. దేవుడు.. అంటూ రిప్లై ఇచ్చాడు కమల్ . ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లా వైరల్ గా మారాయి.కాగా, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, స‌ముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.ఇటీవల విడుదలైనటువంటి ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news