కల్కి మూవీపై ప్రశంసల వర్షం కురిపించిన సూపర్ స్టార్

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ చిత్రం థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతుంది. కల్కి మూవీపై దేశవిదేశాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా అద్భుతమంటూ స్టార్ హీరోలు, స్టార్ టెక్నీషియన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేరారు.

కల్కి 2898 ఏడీ సినిమా చూసిన ఆయన చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను కల్కి మూవీ చూశాను. చాలా గొప్పగా ఉందిమూవీ. దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత, నా ప్రియమైన స్నేహితుడు అశ్విని దత్ కు హృదయపూర్వక అభినందనలు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనె చేస్తున్న కల్కి మూవీ పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందుకోసం భగవంతుడు ఆశీర్వదిస్తాడు.. అంటూ కల్కి సినిమాపై, చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు రజనీకాంత్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news