నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడు అనుకోలేదు : మోహన్ మాఝీ భార్య

-

ఒడిశా ముఖ్యమంత్రి గా బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా రాష్ట్రానికి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ రికార్డు సృష్టించాడు. అయితే తన భర్త ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని తాము ఊహించలేదని మోహన్ మారీ భార్య ప్రియాంకా మారీ అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఊహించలేదని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. భువనేశ్వర్ లోని ప్రభుత్వ క్వార్టర్స్లో మోహన్ తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. మంగళవారం మారీని కొత్త సీఎంగా ప్రకటించడంతో ఒక్కసారిగా వారంతా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. టీవీ ఛానెల్ ద్వారా ఈ విషయం తెలిసిందని, ఆ క్షణం వరకు తన భర్త సీఎం అవుతారని ఎప్పుడూ కూడా ఊహించలేదని ప్రియాంకా చెప్పారు.

బీజేపీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని మాత్రమే ఊహించానని, ఇది నాకు, తమ కుటుంబానికి ఉత్కంఠభరితమైన క్షణమని చెప్పారు. ఈ ప్రకటన వచ్చే సమయంలో తాము వార్తా ఛానెల్ని చూస్తున్నట్లుగా ఆమె చెప్పారు. తన భర్త ఒడిశాకు, సొంత నియోజకవర్గం కియోంజరికి మంచి చేస్తారని ఆమె కావడం చాలా ఆనందంగా ఉందని మోహన్ మారీ తల్లి బలే మారీ  విశ్వాసం వ్యక్తం చేశారు. తన కొడుకు సీఎం అన్నారు. యువకుడి ఉన్న సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చాడని, మొదట సర్పంచ్ అయ్యాడని, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడని, ఇప్పుడు సీఎం అయ్యాడని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version