అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా నేడు చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోకేసపల్లి ఐటీ పార్క్ వేదికన ఉదయం 11. 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు టీడీపీ నాయకులు, అభిమానులు, ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన దేశ ప్రధాని నరేంద్రమోడీకి చంద్రబాబు నాయుడు, మంత్రి పవన్ కల్యాణ్ శాలువా కప్పి జ్ఞాపికను బహూకరించారు.
ఎన్నో గొప్ప పనులు చేసిన చంద్రబాబును ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ విజ హనుమంత రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. యూత్ కాంగ్రెస్ నుంచి చంద్రబాబు అంచెలంచలుగా ఎదిగి నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాడని పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి భయం లేదని, టీడీపీ ఎప్పుడు ప్రజల పక్షాల నిలబడుతుందని వీహెచ్ వెల్లడించారు. గతంలో చంద్రబాబు ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టే ఇప్పుడు ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించుకున్నారని తెలిపారు.