ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన హింసాకాండలో, తీవ్రంగా గాయపడిన జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు ఐషే ఘోష్ ని ఎయిమ్స్ నుంచి సోమవారం విడుదల చేశారు. క్యాంపస్‌లో ఆదివారం జరిగిన హింసాకాండలో ఐషే ఘోష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఎబివిపి సభ్యులు ఆమెను రాళ్ళు, రాడ్లతో కొట్టారని జెఎన్‌యుఎస్‌యు ఆరోపించింది.
ఆమె డిశ్చార్జ్ అయిన తర్వాత ఎయిమ్స్ నుండి బయటకు వచ్చి ఐషే ఘోష్ మీడియాతో మాట్లాడుతూ “నా ఆరోగ్య౦ కుదుటపడగానే వెంటనే పోలీసులతో నా స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తాను. ఎబివిపి సభ్యులపై సంయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి మేము సిద్దమవుతున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు ఆమె, “రాడ్లతో విద్యార్థులపై దాడి చేసిన కొన్ని ముఖాలను నేను గుర్తించగలను.
కొన్ని ముసుగులు ఆగిపోయాయి. గాయపడిన ఇతర విద్యార్ధులు కూడా మీడియా ముందుకు వస్తారని చెప్పుకొచ్చారు. కాగా జెఎన్‌యు టీచర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలో దుండగులు ప్రాంగణంలోకి ప్రవేశించారని, విద్యార్థులు, ప్రొఫెసర్‌లపై దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. మీడియాకు వారు హాకీ స్టిక్స్ తో కనపడినట్టు తెలుస్తుంది. భవనాల చుట్టూ చక్కర్లు కొట్టినట్టు సమాచారం.