నాగ్ విషయంలో మోసపోయాను.. జబర్దస్త్ కమెడియన్..!

-

జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్న కమెడియన్లలో రాము కూడా ఒకరు. ముఖ్యంగా అదిరే అభి టీంలో చేయడం వల్ల బాగా పాపులారిటీ లభించింది అయితే రాము ఒకవైపు కమెడియన్ గా.. మరొకవైపు లేడీ గెటప్లతో అదరగొట్టడమే కాదు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తూ తన పాపులారిటీని అంతకంతకు పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాము.. నాగార్జున కోసం డబ్బులు ఖర్చు చేసి మోసపోయానని చెప్పుకొచ్చాడు. రాము మాట్లాడుతూ… నేను డాన్స్ నేర్చుకొని డాన్స్ బేబీ డాన్స్ జూనియర్స్ లో చేశాను. అప్పట్లోనే నేను ఒక సినిమా ఆడిషన్ కి వెళ్లగా.. డబ్బులు అడగడంతో నేను చేయలేనని చెప్పాను.

ఒక స్టార్ డైరెక్టర్ నన్ను రూ.3లక్షలు అడగగా 3000రూపాయల కూడా ఇవ్వలేనని నేను చెప్పడం జరిగింది. అయితే ఆ డైరెక్టర్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అంటూ తెలిపారు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో నేను ఏడుస్తున్నప్పుడు నాగార్జున గారు కలిశారు. నాగ్ సారు అరుస్తూ ఉన్నారని.. సిగరెట్ ఎక్కడని అడుగుతుండగా.. నేను సిగరెట్ కొని ఇచ్చి నా సమస్య చెప్పానని రాము తెలిపారు. ఆ తర్వాత నాగార్జున కూల్ డ్రింక్ అంటుంటే కూల్ డ్రింక్ కూడా కొనిచ్చానని కామెంట్లు చేసిన రాము.

ఆ తర్వాత ఆయన రియల్ నాగార్జున కాదని. డూప్ నాగార్జున అని చెప్పారు అని తెలిపారు. ఆ విషయం తెలిసి నాకు అసలు విషయం అర్థమైంది.. ఆ డూప్ నాగార్జున పేరు శివ. ఈ ఘటన జరిగి 13 సంవత్సరాలయింది. రియల్ నాగార్జునకి చెప్పి ఆ డబ్బులు వసూలు చేసుకుంటానని రాము తెలిపారు. ఇకపోతే రాము చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే డూప్ నాగార్జునకు ఎంత డబ్బు ఇచ్చాడు అనే విషయాన్ని మాత్రం రాము బయట చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news