తన జీవితంలో కరోనా సోకినా కాలం కష్ట కాలమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పుకొచ్చారు. కరోనా వచ్చిన సమయంలో తాను బ్రతికే అవకాశం లేదని అనుకున్నారని, తాను కూడా అలాగే అనుకున్నా అని కొన్ని లీటర్ల ఆక్సీజన్ ఎక్కించినా సరే తనకు శ్వాస సరిగా అందలేదు అని ఆయన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యు లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
గత నెల 12 న ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటకు వచ్చారు. ముందు హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని భావించినా సరే ఆరోగ్యం విషమించడం తో ఆయనను ప్రత్యేక ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందించింది. అయినా సరే అది సాధ్యం కాలేదు. దాదాపు 10 రోజుల పాటు ఆయన ఆరోగ్యం గురించి ఒక్కటి అంటే ఒక్క వార్త కూడా పాజిటివ్ గా రాలేదు.
తాజాగా ఆయన తన కరోనా చికిత్స గురించి పలు విషయాలను వెల్లడించారు. తాను మరణిస్తే ఆ వార్తను బయట ప్రపంచానికి ఏ విధంగా చెప్పాలి అనే దాని మీద కసరత్తులు కూడా వైద్యులు చేసారని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు గతంలో చాలా గాయాలు అయ్యాయి గాని ఇలాంటి పరిస్థితి ఏ నాడు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తనకు కూడా ఒకానొక సందర్భంలో నమ్మకం పోయిందని అన్నారు.
తనకు ఎలా కోలుకోవాలో అర్ధం కాలేదని దీనికి చికిత్స లేదని, దీని గురించి తాను ఎక్కువగా ఆలోచనలు చేసే వాడిని అని ఆయన వివరించారు. త్వరలో అంతా సర్దుకుని తాను మామూలు మనిషి అవుతా అని ఆశాభావం వ్యక్తం చేసినట్టు గుర్తు చేసుకున్నారు జాన్సన్. వైద్యులు తన కోసం చాలా కష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటితే ఎం చెయ్యాలి అనేది కూడా వైద్యులు ఆలోచిన్చారని అన్నారు.