తబ్లిగీ లపై ఈ సీఎం కోపం పీక్స్ లో ఉంది కదా!

-

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా విషయంలో నేడు దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులకి ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ఢిల్లీ మర్కజ్ ఘటనే కారణం అని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. వారు నమ్ముతున్నారని కాదు కానీ… ఇదే వాస్తవం అని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా తాండవం చేస్తున్న సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి.

ఈ విషయంలో ఇక అయ్యిందేదో అయ్యిందిలే అని ఈ ఢిల్లీ మర్కజ్ ఘటనపై ఎవరు లైట్ తీసుకున్నా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం లైట్ తీసుకోవడం లేదు! ఈ నేపథ్యంలో తాజాగా తబ్లిగీ జమాత్ కార్యక్రమంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. తాజాగా జరిగిన “ఈ ఎజెండా ఆజ్తక్” అనే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తబ్లిగీ జమాత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

“తబ్లిగీ జమాత్ చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని మొదలుపెట్టిన ఆయన… తబ్లిగీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండిఉంటే లాక్ డౌన్ మొదటి దశలోనే కరోనాను పూర్తిగా కట్టడి చేసేవాళ్లం అని.. తబ్లిగీ జమాత్ చేసింది కచ్చితంగా నేరమే అని.. కాబట్టి సభ్యులకు కచ్చితంగా శిక్షపడాలని యోగి అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో తమ రాష్ట్రంలో సుమారు 3000 మంది తబ్లిగీ జమాత్ సదస్సుతో సంబంధం ఉన్నవారు ఉన్నారని ప్రకటించిన యోగి… రోగం తెచ్చుకోవటం ఏమాత్రం నేరం కాకపోవచ్చు కానీ… ఆ రోగాన్ని దాచిపెట్టడం మాత్రం కచ్చితంగా నేరమే అని… చట్టాన్ని అతిక్రమించిన వారందరిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు! ఈ లెక్కన చూసుకుంటే… ఈ వ్యవహారాన్ని యోగి అంత సులువుగా వదిలేలా లేనట్లే!!

Read more RELATED
Recommended to you

Latest news