దాదాపు 50 ఏళ్ల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమానం అవశేషాలను తాజాగా గుర్తించారు. ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-12-534 విమానం 1968 ఫిబ్రవరి 7న గల్లంతైంది. అప్పటి నుంచి ఆ విమానం ఆచూకీ తెలియలేదు. తాజాగా ఆదివారం ఈ విమాన శకలాలు ఢాకాలో బయటపడ్డాయి. 50 ఏళ్ల క్రితం గల్లంతైన విమానం ఆచూకీపై అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
2003లో హిమాలయన్ మాంటనేరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు తమ ఆచూకీలో ఈ విమవానంలో జర్నీ చేసిన సిపాయ్ బేలీరామ్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆ విమానం ఎక్కడైనా దొరుకుతుందన్న చిన్న ఆశ ఎక్కడో మిగిలి ఉంది. దీంతో భారత వాయుసేన మరోసారి గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. దీంతో 2007లో ఈ విమానంలో ఉన్న వారిలో మరో రెండు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఇక 2009 నుంచి ఈ విమానం ఆచూకి చర్యలు ఆపేశారు.
గత జూలైలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా గ్లేషియర్‌లో ఈ విమానానికి సంబంధించిన శకలాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఎయిర్‌ఫోర్స్ మరోసారి గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం విమానానికి సంబంధించిన ప్రధాన భాగాలు దొరికాయి. ఏరో ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇంధన ట్యాంక్ యూనిట్, ఎయిర్‌బ్రేక్ అసెంబ్లీ, కాక్‌పిట్ డోర్ తదితర భాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
భారత ఎయిర్‌ఫోర్స్ చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా దీనిని చెపుతారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో వెళుతున్న ఈ విమానం కొద్ది సేపట్లో ల్యాండ్ అవుతుందనగా మాయమైంది. ల్యాండింగ్‌కు ముందు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాలని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది పైలట్‌కు సమాచారమిచ్చారు.
ఆ ఆదేశాలతో ఫైలెట్ విమానాన్ని వెంటనే ఛండీగడ్‌కు మళ్లించారు. అయితే మధ్యలోనే ఈ విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు ఈ విమానం ఆచూకి తెలియకుండా పోయింది. ఎట్టకేలకు ఇప్పుడు దీని ఆచూకి తెలిసింది.