చిరంజీవి సినిమాలు మేము అప్లోడ్ చెయ్యడం లేదు: ఐ బొమ్మ బిగ్ షాక్

-

ఐ బొమ్మ మూవీ డౌన్లోడ్ వెబ్ సైట్ గురించి ఇండియా ప్రేక్షకులకు తెలిసిందే. ఈ వెబ్ సైట్ లో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు ఈ సైట్ లో దర్శనం ఇస్తుంటాయి. ప్రింట్ కూడా చాల క్వాలిటీ గా ఉంటూ కొన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ముందుకు దూసుకువెళుతూ ఉంది. ఇక ఈ మధ్యనే ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకులు తెలుగు ఇండస్ట్రీ కి ఒక వార్నింగ్ ను పంపించారు.. తెలుగు నిర్మాతలు హీరోలకు ఎక్కువగా రెమ్యూనరేషన్ లు ఇస్తూ ఎక్కువ రేట్ లకు సినిమాలను అమ్ముతున్నారు, దీనితో ఆటోమాటిక్ గా టికెట్ రేట్లు పెరుగుతున్నాయి.. ఇది సామాన్య ప్రజలకు భారంగా మారిందంటూ విమర్శించారు. ఇక తాజాగా మరో విషయాన్ని హైలైట్ చేస్తూ పోస్ట్ పెట్టారు.. మా వెబ్ సైట్ లో చిరంజీవి సినిమాలను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు, ఎవ్వరూ కనీసం ఈ సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవడంలో ఆసక్తిని చూపించడం లేదు.

అందుకే ఇకపై మెగాస్టార్ చిరంజీవి సినిమాలను మా వెబ్ సైట్ లో అప్లోడ్ చేయడం లేదంటూ మెసేజ్ పెట్టారు. ఇది నిజంగా ఇండస్ట్రీ కి, చిరంజీవికి మరియు ఫ్యాన్స్ కు తీరని అవమానం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news