8 క్రికెట్ టోర్నమెంట్లకు వేదికలు ఖరారు చేసిన ఐసీసీ..ఇండియా వేదికగా మూడు మెగా ఈవెంట్లు

-

టీ 20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మరోకొన్ని ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్లకు వేదికలు ఖరారు చేసింది ఐసీసీ. ఛాపియన్స్ ట్రోఫీ మొదలుకుని వివిధ ప్రపంచ కప్ స్థాయి టోర్నీలకు వేదికలు ఖరారు చేసింది.

2024 టీ 20 ప్రపంచ కప్ పోటీలకు అమెరికా, వెస్టీండీస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అలాగే

2026 టీ 20 ప్రపంచ కప్ కు ఇండియా, శ్రీలంక,

2028 టీ 20 ప్రపంచకప్ కు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

2030లో టీ 20 ప్రపంచ కప్ కు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండులు ఆతిథ్యం ఇవ్వనున్నాయి

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్,

2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా..

2027 వన్డే ప్రపంచ కప్ కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా టోర్నీని నిర్వహించనున్నాయి.

2031 వరల్డ్ కప్ కు ఇండియా, బంగ్లాదేశ్ లు సంయుక్తంగా టోర్నీని నిర్వహించనున్నాయి.

ఇదిలా ఉంటే పాక్ లో నిర్వహించే 2025 ఛాంపియన్స్ ట్రోఫిపై అభిమానులు కాస్తంత గందరగోళంగా ఉన్నారు. ఇటీవల కాలంలో పాక్ లో ఉగ్రవాదుల కారణంగా ఏ పెద్ద జట్టు ఆ దేశంలో ఆడేందుకు సాహసించం లేదు. దీంతో 2025లో  అయినా వివిధ దేశాల జట్లు వస్తాయా..? రావా..? లేకపోతే వేదికను మారుస్తారా..అనే సందేహాలు ఇప్పుడే వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news