ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ కె ఎల్ రాహుల్ గాయం నుండి కోలుకుని వరల్డ్ కప్ కు వచ్చాడు. అందరూ తన బ్యాటింగ్ గురించి విమర్శిస్తున్న వేళ వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ లోనూ ఎన్నో కష్టాల్లో ఉన్న టీం ను తనదైన సూపర్ ఇన్నింగ్స్ తో విజయాన్ని అందించాడు రాహుల్. ఈ ప్రదర్శనతో రాహుల్ ఐసీసీ వన్ డే ర్యాంకింగ్ లోనూ భారీగా మెరుగు అయ్యాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్ లలో కె ఎల్ రాహుల్ ఏకంగా 15 స్థానాలు జంప్ చేసి 19వ ర్యాంక్ కు చేరుకున్నాడు. రాహుల్ ఇదే విధమైన ఆటతీరును ఈ వరల్డ్ కప్ లో ప్రదర్శిస్తే నెంబర్ 1 స్థానానికి చేరుకున్న ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎందుకంటే… నెంబర్ 1 లో ఉన్న బాబర్ ఆజం ఫామ్ లో లేకపోవడం, నెంబర్ 2 లో ఉన్న గిల్ అనారోగ్యం కారణంగా ఇంకా ఒక మ్యాచ్ కూడా ఆడకపోవడంతో అవకాశాలు లేవని చెప్పలేము.
ఇక విరాట్ కోహ్లీ కూడా ఒక స్తానం మెరుగుపరుచుకుని 7వ స్థానానికి చేరుకున్నారు.